Young Producer Raghavendra Pujari Wraps Up ‘Lucy’ Shoot
టాలీవుడ్లో యంగెస్ట్ ప్రొడ్యూసర్‌గా రాఘవేంద్ర పూజారి..
‘లూసీ’తో సైకలాజికల్ థ్రిల్లర్‌కు కొత్త టచ్
టాలీవుడ్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న యువ నిర్మాతల్లో రాఘవేంద్ర పూజారి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఒకవైపు ఎన్ఐటీ వరంగల్‌లో బీటెక్ తొలి సంవత్సరం చదువును కొనసాగిస్తూనే, మరోవైపు సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘లూసీ’ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Young Producer Raghavendra Pujari Wraps Up ‘Lucy’ Shoot
సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై, అండాలమ్మ పిక్చర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘లూసీ’ ఇప్పటికే తన చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్, అనూహ్య ట్విస్టులతో ప్రేక్షకులను కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ చిత్రంలో చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విభాగంలో ఎంసీ సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహించగా, వియాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ అడపా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం నుంచి టీజర్, ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సైకలాజికల్ థ్రిల్లర్లను ఆస్వాదించే ప్రేక్షకులకు ‘లూసీ’ ఓ డిఫరెంట్ సినీ అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.
ఇదిలా ఉండగా, అత్యంత చిన్న వయసులోనే నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన రాఘవేంద్ర పూజారి, చదువుతో పాటు సినీ నిర్మాణాన్ని సమతూకంగా కొనసాగిస్తూ వరుస చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. యువతకు విద్యతో పాటు తమ కలలను కూడా సమాంతరంగా సాధించవచ్చని తన ప్రయాణం ద్వారా నిరూపించాలని ఆయన సంకల్పించారు. ఈ కారణంగా ఆయన టాలీవుడ్లో ఓ ప్రామిసింగ్ యంగ్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందుతున్నారు.