Jailer 2 Locks Dasara Release
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్‌పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అక్టోబర్ 15న సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తొలి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి కథ, యాక్షన్, స్టార్ కాస్ట్‌ను మరింత గ్రాండ్‌గా సిద్ధం చేస్తున్నారనే సమాచారం.
Jailer 2 Locks Dasara Release
మొదటి భాగంలో మెప్పించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ఈ సీక్వెల్లోనూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త నిజమైతే ‘జైలర్ 2’ పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తొలి భాగంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఊపేసిన అనిరుధ్, ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక మరోవైపు రజినీకాంత్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీ ‘ది డెడ్లీ డాక్టర్’ పాత్రలో కనిపించనుండగా, సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.