Raviteja Irumudi first glimpse on June 3rd
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 3న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ, ఓ పాప కూర్చోని వెనుక నుంచి కనిపిస్తున్నారు.
ఇది కథలో భావోద్వేగాలకు పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్‌పై ‘ద హార్ట్ ఆఫ్ ఇరుముడి.. గ్లింప్స్’ అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ ప్రకటనతో సోషల్ మీడియాలో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. రవితేజ అభిమానులు జూన్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Raviteja Irumudi first glimpse on June 3rd
మరోవైపు షూటింగ్ పూర్తయిపోతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏక కాలంలో కంప్లీట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఇందులోని కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అన్నారు. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ద్వారా రివీల్ చేశారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. జులై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Raviteja Irumudi first glimpse on June 3rd