Prabhas Spirit shoot at Balanagar Vimal Theater
టాలీవుడ్లో తెరకెక్కుతోన్న మోస్ట్ ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ 50శాతం పైగా పూర్తయింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొంపల్లి, అజీజ్ నగర్, కోటి ఉమెన్స్ కాలేజ్ వంటి విభిన్న లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. తాజాగా సోమవారం బాలానగర్‌లోని మైత్రీ మూవీస్‌కు సంబంధించిన విమల్ థియేటర్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్లో థియేటర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కథలో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ విమల్ థియేటర్ దగ్గరకు భారీ ఎత్తున చేరుకుని అక్కడి విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘స్పిరిట్’ నుంచి మరేదైనా పోస్టర్, స్పెషల్ గ్లింప్స్, లేక అప్డేట్ కోసం
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Prabhas Spirit shoot at Balanagar Vimal Theater
‘అర్జున్ రెడ్డి’, యానిమల్ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగా, ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన అవతార్‌లో చూపించబోతున్నారు. ‘స్పిరిట్’ ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కథలో ప్రభాస్ ఓ నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ‘సలార్’ తర్వాత ప్రభాస్ మరోసారి మాస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ ప్రకారం.. ప్రభాస్ పాత్ర చాలా రగ్డ్, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ సహా పలువురు సీనియర్ నటీనటులు ఈ చిత్రలో నటిస్తున్నారు.
Prabhas Spirit shoot at Balanagar Vimal Theater
ప్రభాస్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ‘స్పిరిట్’ నిలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ కథనం, ప్రభాస్ స్టార్డమ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ విలన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. టీ సిరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డివంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.