Vishwak Sen ‘Legacy’ ReleaseDate Announcement
విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెగసీ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘లెగసీ’ సిద్ధమవుతోందని ప్రకటించారు.
Vishwak Sen ‘Legacy’ ReleaseDate Announcement
ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సముద్రతీర నేపథ్యంలో గుర్రాలపై ప్రయాణిస్తున్న విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్ రొమాంటిక్ మూమెంట్లో కనిపించడం పోస్టర్‌కు విభిన్నమైన విజువల్ అప్పీల్‌ను తీసుకొచ్చింది. ఒకవైపు ప్రేమను ప్రతిబింబిస్తూనే, సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఏదో లోతైన కథను దాచినట్లు ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు సినిమా గురించి వచ్చిన అంచనాలకు భిన్నంగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్ కనిపించడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.
సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
దర్శకుడు సాయికిరణ్ రెడ్డి దైదా గతంలో ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను మరింత ప్రతిష్టాత్మక స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం. పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘లెగసీ’ కథ అధికారం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి భావోద్వేగాల చుట్టూ సాగనుంది. తన తండ్రి వదిలి వెళ్లిన వారసత్వం కారణంగా ఊహించని, ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథలో విశ్వక్ సేన్ పాత్రలో ఉండే తీవ్రత, సంఘర్షణ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.
ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటుడు కే కే మీనన్ పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, ఏక్తా రాథోడ్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ల, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగా కూడా ‘లెగసీ’పై మంచి అంచనాలున్నాయి. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు జాషువా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పూర్తి కానుంది. విశ్వక్ సేన్ ఇంటెన్స్ పాత్ర, బలమైన రాజకీయ నేపథ్యం, భారీ తారాగణం, అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ‘లెగసీ’ డిసెంబర్ 4న ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని అందిస్తుందో చూడాలి.