Title: The Red Bag Set to Thrill Audiences on Aug 21
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి తెరకెక్కించిన విభిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
Title: The Red Bag Set to Thrill Audiences on Aug 21
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా సినిమాలోని స్టైలిష్ టేకింగ్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయంటూ వచ్చిన ఫీడ్‌బ్యాక్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన ప్రమోషనల్ కంటెంట్ కంటే సినిమాలో అసలు ఇంపాక్ట్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. కథలో వచ్చే ట్విస్టులను ప్రేక్షకులు ముందుగా ఊహించడం అంత సులభం కాదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠను కొనసాగించేలా దర్శకుడు కథను రూపొందించారు. ప్రతి మలుపు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. సస్పెన్స్, థ్రిల్‌తో పాటు యాక్షన్‌కు కూడా సినిమాలో ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కథలో ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్లే సినిమాను అనుకున్న స్థాయిలో రూపొందించగలిగాం. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ నుంచి లభిస్తున్న సహకారం మరువలేనిది. విభిన్నమైన కథనం, ఊహించని ట్విస్టులు, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా’’. అని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి అన్నారు.