Suriya 48 Launched with Hombale Films
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 48వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘జై భీమ్’ తర్వాత దర్శకుడు టి.జే. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలిపిన సూర్య, ఈసారి ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం జూన్ 29, 2026న చెన్నైలోని పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, “అభిరుచి, అంకితభావం కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసినప్పుడే గొప్ప సినిమాలు పుడతాయని మేము ఎప్పుడూ నమ్ముతాం. సూర్య గారు, టి.జే. జ్ఞానవేల్ గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే నిజాయితీగల, అర్థవంతమైన కథను చెప్పబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.
Suriya 48 Launched with Hombale Films
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కె. కదిర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అత్యున్నత నటుడు సూర్య, విజనరీ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్, విజయవంతమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలు, బలమైన కథ, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాన్ ఇండియా చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి.