సినీ ప్రేక్షకుల్లో కోర్ట్‌రూం డ్రామాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. న్యాయం, సత్యం, అధికారాల మధ్య జరిగే సంఘర్షణను ఆవిష్కరించే హై-స్టేక్స్ కోర్ట్‌రూం థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సిస్టమ్’.
మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. స్పెషల్ రైట్స్, సత్యం, న్యాయం నిజమైన అర్థాన్ని ప్రశ్నించే తీవ్రమైన కథనంతో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.
ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్‌దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. హర్మన్ బావేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ రచించిన ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతూనే, న్యాయపరమైన నాటకంతో ఆలోచింపజేసేలా ఉంటుంది. కథలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశ్ మరియు నిరాడంబరమైన స్టెనోగ్రాఫర్ సారిక రావత్ మధ్య జరిగే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఊహించని విధంగా మొదలయ్యే వారి స్నేహం, వారు పనిచేస్తున్న వ్యవస్థనే సవాలు చేస్తూ అణచివేయబడిన అన్యాయాలను వెలికితీయడానికి దారితీస్తుంది. వ్యక్తిగత నమ్మకాలు, వృత్తిపరమైన బాధ్యతలు, నైతిక విలువల మధ్య జరిగే అంతర్మథనం ఈ చిత్రానికి మరింత బలాన్ని అందిస్తుంది. ఆశయం, నైతికత, సత్యం వంటి ప్రధాన అంశాలను కేంద్రంగా చేసుకున్న ఈ కోర్ట్‌రూం థ్రిల్లర్ మే 22న ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్‌రూం డ్రామాలను ఆసక్తిగా ఎదురుచూసే ప్రేక్షకులకు సిస్టం తప్పక చూడదగ్గ చిత్రంగా నిలవనుంది.






👍