సమంత ఫీమేల్ లీడ్ గా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రంలోని మొదటిపాట గురించి అప్డేట్ ఇచ్చింది సమంత. ఇదొక ఫ్యామిలీ పార్టీ సాంగ్ అని చెబుతూ చిన్న ప్రోమో విడుదల చేసింది. “తస్సాదియా” అంటూ సాగే ఈ పాట ప్రోమోలో ట్రెడిషినల్‌గా కనిపిస్తూ తన ఫ్యామిలీతో కలిసి స్టెప్స్ వేస్తూ ఇంప్రెస్ చేసింది. గురువారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా మే 15న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామా మూవీని అన్ని కమర్షియల్ అంశాలతోపాటు బలమైన ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.





