SakshiMhadolkar Latest Photo Gallery
మోగ్లీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ సాక్షి మదోల్కర్ ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో శ్రీవిష్ణుకి జోడీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సాక్షి మదోల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టైలిష్ లుక్లో మెరిసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ ఈవెంట్లో సాక్షి సందడి చేసిన ఫొటోలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న సాక్షి మదోల్కర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరీపై ఓ లుక్కేయండి.
SakshiMhadolkar Latest Photo Gallery






















