Ramcharan Peddi Pressmeet In Chennai
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు, పవర్ఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా పాన్ ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. శనివారం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Ramcharan Peddi Pressmeet In Chennai
ఈ ప్రెస్ మీట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ, “చెన్నైకి ఎప్పుడు వచ్చినా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం కూడా ఇక్కడికి వచ్చాను. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాం. నేను 285 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నాను. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ గారు ప్రధాన బలం. ఆయనలాంటి లెజెండ్‌తో పని చేయడం గొప్ప అనుభవం. శివరాజ్‌కుమార్ గారిని స్క్రీన్‌పై చూస్తే ఓ ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంది. ‘జైలర్’లో ఆయన నటన నాకు ఎంతో నచ్చింది. రత్నవేలు గారు ఈ సినిమాకు విజువల్‌గా భారీ స్థాయిని తీసుకొచ్చారు. జాన్వీ కపూర్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన అందాన్ని జోడించారు. నిర్మాత సతీష్ కిలారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కేవలం కష్టపడి చేసిన సినిమా కాదు, ఎంతో ఇష్టంతో చేసిన సినిమా. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల సమయంలో ఎలా గొప్ప ఫీలింగ్ కలిగిందో, ‘పెద్ది’ విషయంలో కూడా నాకు అదే నమ్మకం ఉంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, మంచి సందేశాన్ని కూడా అందించే సినిమా. నా కెరీర్లో జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటి. ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా నిలుస్తుంది. ప్రేక్షకులందరూ జూన్ 4న థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో గౌర్నాయుడు లాంటి బలమైన పాత్ర ఇచ్చిన బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు. రామ్ చరణ్ గారు, వారి కుటుంబంతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. చరణ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా అనిపించింది. ‘పెద్ది’ ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే ప్రయాణం. బుచ్చిబాబు కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. నిర్మాత సతీష్ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. రామ్ చరణ్ నటన, ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ “చిరంజీవి గారు ఒక గొప్ప స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత సులభం కాదు. అయితే రామ్ చరణ్ తన ప్రతిభతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు ఎంతో ఇష్టం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న ఇండస్ట్రీలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ సినిమా కోసం పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
Ramcharan Peddi Pressmeet In Chennai
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘చెన్నై అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ అడుగుపెడితేనే సినిమా కనిపిస్తుంది. ‘పెద్ది’ ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నాపై నమ్మకం ఉంచిన చరణ్ గారికి కృతజ్ఞతలు. ఏఆర్ రెహమాన్ గారితో కలిసి పని చేయడం నా కల. అది నిజమవడం అదృష్టంగా భావిస్తున్నాను. రత్నవేలు గారు ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో చూపించారు. శివరాజ్‌కుమార్ గారు గురువు పాత్రలో అద్భుతంగా నటించారు. గురుశిష్యుల బంధం ఈ చిత్రంలో హృదయాలను తాకుతుంది” అని పేర్కొన్నారు.
నటుడు దివ్యేందు శర్మ మాట్లాడుతూ “‘పెద్ది’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఒక నటుడిగా ఇది నాకు గొప్ప అవకాశం. బుచ్చిబాబు గారు అద్భుతమైన దర్శకుడు. రామ్ చరణ్ గారితో కలిసి పని చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఆయన చూపించిన ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ఉన్న చిత్రంలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు.
డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ “‘పెద్ది’ నా కెరీర్లో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుంది. బుచ్చిబాబు ఒక బ్రిలియంట్ దర్శకుడు. నాపై నమ్మకం ఉంచిన రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక గొప్ప సినిమాను అనుభవిస్తారు. శివరాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ సహా ప్రతి నటుడు అద్భుతంగా నటించారు. రామ్ చరణ్‌తో ఇది నా నాలుగో సినిమా. జూన్ 4న ‘పెద్ది’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది” అని అన్నారు.