Rag Mayur Best Actor Honor for Sivarapalli
తెలుగు నటుల ప్రతిభ ఇప్పుడు ప్రాంతీయ సరిహద్దులను దాటి జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎలాంటి స్టార్డమ్ హంగామా లేకుండా, నేచురల్ యాక్టింగ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రామ్ మయూర్. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ (NEXA Streaming Academy Awards) వేడుకలో ఆయన ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు.
Rag Mayur Best Actor Honor for Sivarapalli

ఈ అవార్డు ఆయన అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సివరపల్లి’లోని నటనకు గానూ లభించింది. గ్రామీణ నేపథ్యంలోని పాత్రను అతని పాత్రకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అదే గుర్తింపుగా ఇప్పుడు జాతీయ వేదికపై అత్యున్నత గౌరవం ఆయనను వరించింది. దేశవ్యాప్తంగా సినీ, ఓటీటీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఈ అవార్డుల వేడుకలో రాగ్ మయూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ దిగ్గజ నటులు మనోజ్ బాజ్పేయి, బోమన్ ఇరానీ, అలాగే ప్రముఖ దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి దిగ్గజాలతో ఒకే వేదికను పంచుకోవడం ఆయన కెరీర్లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
ప్రస్తుతం మంచి కథలకు, నిజాయితీగా రూపొందిన పాత్రలకు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆదరణ చూపిస్తున్నారనడానికి రాగ్ మయూర్ విజయం నిదర్శనం. ఒక నటుడు పాత్రలో పూర్తిగా లీనమైతే భాష అడ్డంకి కాదని, ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తప్పక లభిస్తుందని ఆయన మరోసారి నిరూపించారు.
ప్రాంతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఓటీటీ వేదికల ద్వారా తెలుగు నటులకు కొత్త అవకాశాలు లభిస్తున్న ఈ సమయంలో, రాగ్ మయూర్ అందుకున్న ఈ గౌరవం తెలుగు పరిశ్రమకు మరింత గర్వకారణం. తన అంకితభావం, సహజమైన నటనతో ఈ విజయాన్ని అందుకున్న ఆయన… రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.