NTR Trivikram Reunite for Epic Mythological
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ‘అరవింద సమేత వీరరాఘవ’తో విజయాన్ని అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొద్ది నెలలుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.
NTR Trivikram Reunite for Epic Mythological
ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్లో మండుతున్న యుద్ధభూమి, శిథిలమైన పురాతన దేవాలయాలు, ఆకాశాన్ని చీల్చుకుంటూ కనిపించే శివుడి త్రిశూలం, దాని మధ్యలో కుమారస్వామి శక్తి ఆయుధం కనిపించడం సినిమాపై భారీ ఆసక్తిని పెంచుతోంది.
పోస్టర్లో దాగిన అసలు క్లూ ఇదే!
“శివుని కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. శాశ్వత సేనాపతి.” అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్లో ప్రతి అంశం ఓ ప్రత్యేక అర్థాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా శక్తి ఆయుధం చుట్టూ డీఎన్ఏ ఆకారంలో కనిపించే మేఘాలు ఆసక్తికరంగా మారాయి. అలాగే పోస్టర్‌పై కనిపిస్తున్న సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, “One Spear… One Aim… One Divine Verdict” అనే ట్యాగ్‌లైన్ సినిమాకు మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉండబోతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.
NTR Trivikram Reunite for Epic Mythological
మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న భారీ చిత్రం
ఈ చిత్రం కేవలం పురాణ కథ కాదు. దైవశక్తి, విశ్వసృష్టి, మానవ డీఎన్ఏ మధ్య ఉన్న సంబంధాన్ని కొత్త కోణంలో చూపించే మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ విజువల్ ఎపిక్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
పురాణాల స్ఫూర్తితో రూపొందే కథలో భారీ యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా, అద్భుతమైన వరల్డ్ బిల్డింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.
ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో?
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) స్ఫూర్తితో రూపొందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
అనిరుధ్ సంగీతం.. ప్రపంచస్థాయి టెక్నికల్ టీమ్
ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అనిరుధ్ ఈ చిత్రానికి కూడా ప్రత్యేకమైన సంగీతానుభూతిని ఇవ్వనున్నాడు.
రెండు అగ్ర నిర్మాణ సంస్థల కలయిక
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఇప్పుడే మొదలైన అంచనాల తుఫాన్
ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ రచన-దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్… ఇవన్నీ కలిసిరావడంతో ఈ సినిమా ప్రకటనతోనే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇక నటీనటులు, టైటిల్, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీ వంటి వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. అప్పటివరకు పోస్టర్లో దాగిన ప్రతి క్లూను అభిమానులు విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో చర్చలు కొనసాగిస్తున్నారు.