ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌‌ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందజేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ చిత్రంలో గోపీచంద్‌ను పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో, భావోద్వేగాలతో నిండిన పాత్రలో చూడబోతున్నామని దర్శకుడు వి వెంకట్ తెలిపారు. తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకున్న ఆయన, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే టాప్ టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తోంది. షామ్‌దత్ ISC సినిమాటోగ్రఫీ, సామ్ CS సంగీతం, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, గోపీచంద్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ మేళవింపుతో #గోపీచంద్34 ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం రాజమౌళి సినిమాకు షాక్.. 150 వాటర్ ట్యాంకర్లకు నో చెప్పిన అధికారులు మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్‌ట్రోటర్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ మూవీ ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీకి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 6 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్