Dulquer Salmaan Stylish Avatar in I Am Game
‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తెలుగు దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు మరింత దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ అత్యంత స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.
Dulquer Salmaan Stylish Avatar in I Am Game
ఈ చిత్రాన్ని ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు జోమ్ వర్గీస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచనతో పాటు స్క్రీన్‌ప్లే అందించారు.
దక్షిణ భారతదేశంలోని వందకు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ చిత్రం ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తన కెరీర్లో ఇప్పటివరకు కనిపించని స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. దుల్కర్ సల్మాన్ కెరీర్లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కాయడు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ రూపొందిస్తున్నారు. ‘ఆర్డీఎక్స్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం కావడంతో ‘ఐ యామ్ గేమ్’పై మరింత ఆసక్తి నెలకొంది.
మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రేక్షకులకు భారీ స్థాయి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ను అందించేందుకు సిద్ధమవుతోంది.