Dinesh Tej Tattvam Telugu Movie Review
చిత్రం : తత్వం
రేటింగ్ : 2.5/5
నటీనటులు : దినేష్ తేజ్, దష్విక.కె తదితరులు
బ్యానర్స్ : త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్కే ప్రొడక్షన్స్
నిర్మాతలు : వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అర్జున్ కోల
సంగీత దర్శకుడు : చేతన భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : భరత్ పట్టి
ఎడిటర్ : విప్లవ్ నైషదం
విడుదల తేదీ : 2 అక్టోబర్ 2026
Dinesh Tej Tattvam Telugu Movie Review
కథ విషయానికొస్తే..
ఓ పల్లెటూరి నేపథ్యంలో జరిగే హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సాధారణంగా కనిపించే ఓ హత్య వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటి? ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కథ ముందుకు సాగుతుంది. మూడనమ్మకంకు నమ్మకం మధ్య ఉండే ఓ సన్నని గీత చుట్టే ఈ కథ తిరగుతుంది. 2000వ సంవత్సరంలో నడిచే కథ ఇది. ప్రారంభంలోనే మర్డర్ ఎపిసోడ్‌ను చూపిస్తూ ఆసక్తిని కలిగించిన దర్శకుడు.. ఆ తర్వాత ఒక్కో పాత్రను కథలోకి తీసుకొస్తూ మిస్టరీని నడిపించే ప్రయత్నం చేశారు. గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలు, అనుమానాలు కథకు అదనపు బలంగా నిలుస్తాయి. క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ అసలు నిజాన్ని రివీల్ చేసే విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
కానిస్టేబుల్ కళ్యాణ్ తేజ్ పాత్రలో దినేష్ తేజ్ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ మరింత ఆకట్టుకుంటుంది. దష్విక.కె కూడా తన పాత్ర పరిధిలో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుంది. కథకు తగ్గ పాత్రల్లో నటీనటులు సహజంగా కనిపించారు. ముఖ్యంగా మిస్టరీని ముందుకు తీసుకెళ్లే కీలక పాత్రల్లో నటించిన వారు తమ పరిధిలో మెప్పించారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, అనుమానాస్పద పరిస్థితుల్లోనూ నటీనటుల పెర్ఫార్మెన్స్ కథకు తగ్గట్టుగా సాగింది.

టెక్నికల్ టీమ్ గురించి..
గ్రామీణ నేపథ్యాన్ని తెరపై చూపించడంలో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కథలోని మూడ్‌కు తగ్గట్టుగా విజువల్స్‌ను తెరకెక్కించారు. చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో టెన్షన్‌ను పెంచుతుంది. ఎడిటింగ్ విషయంలో మరింత షార్ప్‌గా ఉంటే సినిమా వేగం ఇంకాస్త పెరిగేది.
సినిమా ఎలా ఉందంటే..
మర్డర్ మిస్టరీ జానర్లో కొత్తగా ఏదైనా చూపించాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కథను నెమ్మదిగా విప్పుతూ వెళ్లడం వల్ల మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు కాస్త స్లోగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ దగ్గర నుంచి మిస్టరీపై ఆసక్తి పెరుగుతుంది. రెండో భాగంలో అనుమానాలు ఒక్కో పాత్రపైకి మళ్లిస్తూ కథను నడిపించడం బాగుంది. క్లైమాక్స్‌లో మర్డర్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించే విధానం సినిమాకు కీలకంగా మారింది. పెద్దగా కమర్షియల్ హంగులు లేకుండా కథ, పాత్రలు, మిస్టరీ మీదే ఆధారపడిన సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్ :
మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్
గ్రామీణ నేపథ్యం
ఆసక్తికరమైన కీలక సన్నివేశాలు
నటీనటుల సహజమైన పెర్ఫార్మెన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
ఫస్ట్ హాఫ్‌లో వేగం తగ్గడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
ఇదొక విలేజ్ మర్డర్ మిస్టరీగా చెప్పినట్టుగానే ఓ పల్లెటూరి హత్య చుట్టూ నడిచే మిస్టరీ డ్రామా. కథలోని ట్విస్టులను ముందుగానే ఊహించకుండా చూసేవారికి సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల నెమ్మదిగా సాగినా.. మిస్టరీని చివరి వరకు క్యారీ చేయడం, క్లైమాక్స్‌లో అసలు విషయాన్ని రివీల్ చేయడం సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయొచ్చు.