Allari Naresh Rambha Urvashi Menaka First Look
కామెడీకి తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల ప్రయాణంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న 65వ చిత్రం ఆసక్తికరమైన టైటిల్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రంభ ఊర్వశి మేనక’ అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Allari Naresh Rambha Urvashi Menaka First Look
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేష స్పందనను అందుకుంటోంది. ‘Comedy Goes Cosmic’ అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ, కామెడీ, మ్యాజికల్ ఎలిమెంట్స్ కలయికగా ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ను అందించబోతోందనే సంకేతాలను ఫస్ట్ లుక్ ఇస్తోంది.
పోస్టర్లో అల్లరి నరేష్ స్వర్గలోకపు మెట్లపై కూర్చొని, చేతిలో ‘రంభ, ఊర్వశి, మేనక’ పేర్లు రాసి ఉన్న పేపర్‌తో కనిపిస్తారు. ఆయన చుట్టూ మేఘాల మధ్య అప్సరసల రూపాలు కనిపించడం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినోదంతో పాటు ఫాంటసీ టచ్‌ను అందంగా మిళితం చేసిన ఈ డిజైన్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
సాంకేతిక విభాగంలోనూ బలమైన బృందమే ఈ చిత్రానికి పని చేస్తోంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. విజువల్‌గా గ్రాండ్‌గా, వినోదపరంగా పూర్తి స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వినూత్నమైన టైటిల్, ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్, ఫాంటసీ-కామెడీ కాన్సెప్ట్‌తో ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ‘రంభ ఊర్వశి మేనక’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.