AH – Idhena Idhena Lyrical Song Released
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘అ’ (AH). ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు ‘బ్లడీ హంగర్’ గ్లింప్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
AH – Idhena Idhena Lyrical Song Released
శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు సుమన్ చిక్కాల సాహిత్యం అందించగా, షణ్ముఖ్ భరద్వాజ్ పాడారు. శుక్రవారం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. రాహుల్ విజయ్ ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఆర్చన అయ్యర్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కథలో అదృశ్యం, అన్వేషణ, అనుమానం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని దర్శకుడు వెల్లడించారు. మరోవైపు, ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైనదని సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పేర్కొన్నారు. సినిమా కోసం నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో పనిచేశారని రాహుల్ విజయ్ తెలిపారు.
స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి కనకరావు తొనంగి, అభిషేక్ కె, గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్ అంశాలతో రూపొందుతున్న ‘అ’ (AH) అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది.