Shiv Rajkumar’s powerful look from Peddi into Gouru Naidu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌తో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా చిత్రబృందం మరో పవర్‌ఫుల్ అప్డేట్ ఇస్తూ కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Shiv Rajkumar’s powerful look from Peddi into Gouru Naidu
ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ “గౌరు నాయుడు” అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుస్తీ బరిలో పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపించిన శివ రాజ్‌కుమార్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రఫ్ అండ్ మాస్ అవతార్‌లో ఆయన కనిపించిన తీరు పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రత్యేకంగా గౌరు నాయుడు పాత్రలో శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన గ్లింప్సెస్ భారీ రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు శివ రాజ్‌కుమార్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Shiv Rajkumar’s powerful look from Peddi into Gouru Naidu
ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు విజువల్స్‌ను అందిస్తున్నారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.





