A Fresh Pair Under Srinu Vaitla's Direction
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘నారీ నారీ నడుమ మురారి, ‘బైకర్’ హిట్స్ తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని కామెడీ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీను వైట్ల మార్క్ కామెడీకి ‘టైమ్ ట్రావెల్’ కాన్సెప్ట్‌ను జోడిస్తూ రూపొందనున్న ఈ వినోదాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా, కొన్ని కారణాలతో వారు తప్పుకోవడంతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కనుంది. ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత అనిల్ సుంకర, -శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి.
A Fresh Pair Under Srinu Vaitla's Direction
ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మొదట పూజా హెగ్డే, మమితా బైజు పేర్లు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం మేకర్స్ మానస వారణాసి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస, శర్వానంద్ సరసన కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే ఫైనల్ అయితే శర్వా-మానస జోడీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం శర్వానంద్ ‘భోగి’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, జులై 2026 నుంచి శ్రీను వైట్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉండటంతో త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.








👍