35 ఏళ్ల ‘గ్యాంగ్ లీడర్’ : మెగాస్టార్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం

35 ఏళ్ల ‘గ్యాంగ్ లీడర్’ : మెగాస్టార్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం

1991 మే 9న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లో మాస్ స్టార్‌డమ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన చిత్రాల్లో ఇది ప్రత్యేక స్థానం సంపాదించింది. దర్శకుడు విజయ బాపినీడు రూపొందించిన ఈ సినిమా విడుదల రోజు నుంచే ప్రేక్షకాదరణతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

కథలో ఉన్న బలం
ఈ చిత్రంలో చిరంజీవి పోషించిన రాజారాం పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కుటుంబ బంధాలు, అన్నదమ్ముల అనుబంధం, అన్యాయానికి ఎదురు నిలిచే యువకుడి ఆవేదన ఇవన్నీ కలిసిన ఎమోషనల్ మాస్ డ్రామాగా గ్యాంగ్ లీడర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. మామూలు కమర్షియల్ కథకు ఫ్యామిలీ ఎమోషన్‌ను జోడించడం అప్పట్లో సినిమాకు పెద్ద బలం అయింది. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు బాగా వర్కవుట్ అయ్యాయి. అలాగే చిరంజీవి, విజయశాంతి జోడీ అప్పట్లో ట్రెండింగ్‌లో ఉంటూ అందర్నీ ఆకట్టుకున్నారు. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌‌పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయగా, వీరందరికీ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

చిరంజీవి ఇమేజ్‌కు కొత్త నిర్వచనం
1990ల ప్రారంభంలో చిరంజీవి అప్పటికే అగ్రనటుడు. కానీ గ్యాంగ్ లీడర్ తర్వాత ఆయనలోని మాస్ అప్పీల్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బలపడింది. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లు, డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్ డెలివరీ యూత్‌ను అట్రాక్ట్ చేశాయి. థియేటర్లలో అభిమానుల హోరెత్తిన స్పందన అప్పట్లో పెద్ద చర్చగా మారింది. దాదాపు 50 సెంటర్స్‌లో ఈ సినిమా వంద రోజులు విజయవంతంగా పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌‌లో అయితేకంటిన్యూగా 162 రోజులు ఆడి దీర్ఘకాల ప్రదర్శనతో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో మాస్ మార్కెట్‌ను మరింత విస్తరించిన సినిమాగా చెప్పబడుతుంది.

సంగీతం కూడా విజయానికి బలమైన అస్త్రం
సంగీత దర్శకుడు బప్పీ లహరి అందించిన పాటలు సినిమా విజయంలో భాగం అయ్యాయి. మాస్ బీట్‌తో పాటు ఎమోషన్‌కు తగిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలైన తర్వాత పాటలు రేడియోల్లో, క్యాసెట్లలో విస్తృతంగా వినిపించాయి. పాల బుగ్గ, భద్రాచలం కొండా, పాప రీటా, వయసు వయసు, వాన వాన.. అంటూ సాగిన ఈ సినిమాలో పాటలన్నీ మ్యూజికల్‌ హిట్‌ నిలిచాయి.

ఇప్పటికీ ఎందుకు ప్రత్యేకం?
గ్యాంగ్ లీడర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకునే కారణం ఒక్క బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు. ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్, ఎంటర్‌‌టైన్‌మెంట్, మ్యూజిక్ .. ఈ నాలుగు అంశాలు సమానంగా ఉంటూ కమర్షియల్ ప్యాకేజ్ కావడం. ముఖ్యంగా రాజారాం పాత్రలో చిరంజీవి చూపించిన ఎనర్జీ ఈ చిత్రాన్ని తరతరాల ప్రేక్షకులకు గుర్తుండేలా చేసింది.
35 ఏళ్ల తర్వాత కూడా ‘గ్యాంగ్ లీడర్’ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మెగాస్టార్ స్క్రీన్‌పై చూపించిన ఆ దూకుడు, ఆ మాస్ మ్యాజిక్.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on “35 ఏళ్ల ‘గ్యాంగ్ లీడర్’ : మెగాస్టార్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’