గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందజేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చిత్రంలో గోపీచంద్‌ను పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో, భావోద్వేగాలతో నిండిన పాత్రలో చూడబోతున్నామని దర్శకుడు వి వెంకట్ తెలిపారు. తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకున్న ఆయన, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే టాప్ టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తోంది. షామ్‌దత్ ISC సినిమాటోగ్రఫీ, సామ్ CS సంగీతం, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, గోపీచంద్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ మేళవింపుతో #గోపీచంద్34 ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.




