‘‘పెద్ది” పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో..
జూన్ 4న పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘‘పెద్ది”
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’లో చరణ్ పెర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటికే ‘రంగస్థలం’లో చరణ్ చూపించిన డెప్త్, ఎమోషనల్ ఇంటెన్సిటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ‘పెద్ది’లో ఆ స్థాయిని దాటి మరింత మేచ్యూర్డ్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని పాత్రలో చరణ్ పూర్తిగా లీనమై నటించారని టాక్.
డాన్స్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. చరణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సుకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “మాటలు రావడం లేదు” అన్న స్థాయిలో ప్రశంసించడం ఫ్యాన్స్‌లో ఎక్సైట్మెంట్ పెంచుతోంది. హైదరాబాద్‌లో షూట్ చేసిన స్పెషల్ సాంగ్‌లో చరణ్ స్టెప్స్ సినిమా హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా ఈ సినిమాను పూర్తిగా చరణ్ క్యారెక్టర్ చుట్టూనే డిజైన్ చేసినట్లు చెప్పారు. ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ పాత్రలో చరణ్ అన్ని వేరియేషన్స్ చూపించబోతున్నాడు. మొత్తానికి ‘పెద్ది’ కేవలం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్ నటుడిగా మరో మెట్టు ఎక్కే సినిమా అవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ 4న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, చరణ్ పర్ఫార్మెన్స్‌తోనే ప్రధానంగా నడిచే సినిమా అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జూన్ 3 ఈవెనింగ్ నుంచే అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత సతీష్ కిలారు అన్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.





