టాలీవుడ్‌లో సాఫ్ట్, నేచురల్ పెర్ఫార్మెన్స్‌కు గుర్తింపు పొందిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ‘ప్రేమమ్’ నుంచి ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ వరకు సాధారణ, అమాయకమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటివరకు చూసిన క్యూట్, గర్ల్-నెక్స్ట్-డోర్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ‘భోగి’లో ఆమె రస్టిక్, ఇన్‌టెన్స్ పాత్రలో మెప్పించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన ‘భోగి’ ఫస్ట్ లుక్‌తో ఆమె కెరీర్ మరో మలుపు తిరగబోతోందని అర్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె ‘కందుల సులోచన రాణి’ పాత్ర పోషిస్తుందని టీమ్ రివీల్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ పాత్రలో ఆమె పూర్తిగా పల్లెటూరి యువతిగా మారిపోయింది. హాఫ్ శారీ, ఫేడెడ్ బ్లౌజ్, తలపై ఆకుల బుట్ట ఇవన్నీ కలిసి ఒక రియలిస్టిక్ లుక్‌ను తెచ్చాయి. ముఖ్యంగా ఆమె కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ ఈ పాత్రకు ఉన్న బలం, ఎమోషన్‌ను సూచిస్తోంది. ఈ పాత్ర కోసం అనుపమ కేవలం లుక్ మార్చుకోవడమే కాదు, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత భాష, యాసను కూడా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్‌లో సహజత్వం తీసుకురావడానికి ఆమె చేసిన రిహార్సల్స్ ఈ పాత్రను మరింత నమ్మకంగా మార్చనున్నాయి. ఇంతకుముందు కూడా మేకోవర్‌తో మెప్పించిన అనుపమ.. తన కెరీర్‌లో ఇది మొదటి ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు. ‘రౌడీ బాయ్స్’లో స్టైలిష్‌గా మోడర్న్ లుక్‌లో మెప్పించింది.
‘కార్తికేయ 2’లో ట్రెడిషనల్, డిగ్నిఫైడ్ పాత్రలో ఇంప్రెస్ చేసింది. మలయాళం సినిమాల్లో ఆమె సహజత్వం, ఎమోషనల్ డెప్త్‌తో గుర్తింపు పొందారు. ఇలా ప్రతి సినిమాలో కొంచెం కొంచెంగా తన ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ వస్తోన్న అనుపమ పరమేశ్వరన్‌కు ‘భోగి’తో కెరీర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్ వస్తుందని ఆశిస్తుంది. ‘భోగి’ పీరియడ్ యాక్షన్ డ్రామా కావడం, ఇందులో ఆమె పాత్ర కథకు కీలకంగా ఉండటం చూస్తే, ఈ సినిమా అనుపమ కెరీర్‌లో పెద్ద మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన అనుపమ కంటే, మరింత బలమైన, గ్రౌండెడ్, పవర్‌ఫుల్ అవతార్‌లో ఆమె కనిపించబోతుంది. మొత్తానికి క్యూట్ ఇమేజ్‌ను దాటి, పెర్ఫార్మర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి అనుపమ తీసుకున్న ఈ స్టెప్ సాహసోపేతమని చెప్పాలి. ‘భోగి’లో సులోచన రాణిగా ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందిస్తున్న ఈ ‘భోగి’ చిత్రంలో మోదుగ ఆకులతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన పాత్రలో అనుపమ తనదైన నటనతో ఇంప్రెస్ చేయనుందని మేకర్స్ తెలియజేశారు. మరో హీరోయిన్‌గా డింపుల్ హయతి నటిస్తోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది.





