భారీ లైనప్‌తో బాలయ్య .. కెరీర్‌‌లో కొత్త జోష్‌తో దూసుకెళ్తున్నారు

ఓవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే, హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ చైర్మన్‌గా క్యాన్సర్ పేషెంట్లకు అండగా నిలబడుతూ… మరోవైపు సినీ నటుడిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సినిమా సినిమాకు అసలు గ్యాప్ ఇవ్వకుండా.. ఒకటి పూర్తవుతూనే మరోకటి మొదలుపెట్టేస్తారు బాలయ్య. ప్రస్తుతం పవర్‌‌ఫుల్ లైనప్స్‌తో దూసుకెళ్తున్నారు. కెరీర్‌లో కొత్త జోష్‌తో ముందుకు సాగుతున్నారు. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోమూవీ స్టార్ట్ చేశారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమై షూటింగ్ దశలోకి వెళ్లింది. ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. మరోవైపు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య ఓ కొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

 

ఇండస్ట్రీ టాక్ ప్రకారం బాలయ్య వరుసగా పలువురు దర్శకులతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివతో ఓ సోషల్ యాక్షన్ డ్రామా చేయనున్నట్టు, అలాగే విజయ్ కనకమేడలతో పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో భారీ ప్రాజెక్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఈ లైనప్‌తో బాలయ్య మాస్‌తో పాటు కొత్త జానర్లను కూడా ట్రై చేయాలని చూస్తున్నారు. ఫైనల్‌గా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. మాస్ సినిమాలకు తోడు కొత్త కథల వైపు కూడా అడుగులు వేస్తూ, తన కెరీర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బాలయ్య నుంచి భారీ బాక్సాఫీస్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్