కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

టాలీవుడ్‌లో తనదైన కామెడీ స్టైల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జెట్లీ’. దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే సత్య తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను పోషించిన పాత్రలో అమాయకత్వం, అజాగ్రత్త, విచిత్రమైన పరిస్థితులు అన్నీ కలగలిసి వినోదాన్ని పంచేలా కనిపిస్తున్నాయి. ‘అందానికే అసూయ పుట్టేలా ఉన్నావ్.. ఎందుకో నాకేమీ గుర్తురావడం లేదు.. పోనీ నీకైనా నేనెవరో తెలుసా.. కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరో’ అనే డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేలా ఉన్నాయి. అయితే “జెట్లీ” కేవలం కామెడీ మూవీ మాత్రమే కాకుండా, ట్రైలర్‌లో యాక్షన్, ఎమోషన్ అంశాలు కూడా చూపించారు. కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉందనే హింట్ ఇవ్వడంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా ట్రైలర్‌కు మంచి ఎనర్జీ ఇచ్చాయి. టెక్నికల్‌గా కూడా సినిమా క్వాలిటీగా కనిపిస్తోంది. మేకర్స్ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి, “జెట్లీ” ట్రైలర్ చూస్తే ఇది నవ్వులతో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కలిగిన ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. సత్య అభిమానులతో పాటు కామెడీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ట్రీట్‌గా మారే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సత్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రితేష్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పెష్ లోనే వుంటుంది. యాక్షన్ కామికల్ గానే వుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో జరిగే ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి సెగ్మెంట్ ని చాలా ఎంజాయ్ చేశాను. రితేష్ స్టయిల్ లో వర్క్ చేయడంతో ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ లు వుంటాయి. మే1న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. ఇది యాక్టర్ ని బట్టి డిజైన్ అయ్యే స్టొరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో ‘జెట్లీ’ అలా వుంటుంది. ఇందులో యాక్షన్ కామెడీ ట్విస్ట్ లు అన్నీ వుంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది.

ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను ఐదు నెలల ఐదు రోజుల్లో షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. నిర్మాతగా ఇంతకంటే కావాల్సింది ఏమీలేదు. డైరెక్టర్ రితేష్ కి థాంక్ యూ. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సత్య, వెన్నెల కిషోర్ గారు చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు అయినప్పటికీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన యూఎస్పీ ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ ఫ్లైట్‌లోనే చేశాం. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఫ్లైట్‌లో జరిగే సంఘటనలు, కామెడీతో ఈ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రితేష్ తనదైన స్టైల్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది ఒక మంచిథ్రిల్లర్. నిజానికి ముందుగా పెద్ద హీరోగా ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. కామెడీ అంటే రితేష్ కి ముందుగా గుర్తొచ్చే పేరు సత్య.సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరినీ తీసుకుని ఈ సినిమా చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మే 1న అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ఇందులో నా పేరు మీరు నేరుగా థియేటర్‌లో తెలుసుకోవాలి. నేను దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్‌లో ఊహించని చిత్రవిచిత్రాలు జరుగుతాయి. నేను టిఎఫ్ఐ బానిసను. కథ చెప్పగానే క్లూస్ పట్టేస్తుంటాను. టైమ్ పాస్ కోసం ఒక సినిమా సుడోకు గేమ్ ఆడుతుంటాను. ఆ గేమ్ నేను పూర్తి చేశానా లేదా అనేది మే 1న ‘జెట్‌లీ’ సినిమా చూసి తెలుసుకోవాలి.

హీరోయిన్ రియా సింఘా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నా పేరు శివాని. నా పాత్ర ఎలా ఉంటుందో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మొత్తం ఫ్లయిట్ లో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో నేను ఫాదర్ ఫీనిక్స్ అనే పాత్ర చేస్తున్నాను. కొందరు శైతాను రక్షకులు. వాళ్ళతో చాలా డేంజర్. నాకు ఫ్లైట్‌లో ఎదురైన సంఘటన ఏమిటో, అది ఎలా మారిందో మే 1న మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి.

గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నేను నూర్జహాన్ అనే పాత్రలో కనిపిస్తాను. నాకు ఫ్లైట్‌లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. దాని వల్ల పెద్ద గొడవ ఏర్పడుతుంది. అది ఏమిటో మే 1న సినిమా చూసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని