ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల

‘మిస్టిక్ థ్రిల్లర్’ జానర్‌లో మరో కొత్త ప్రయోగంగా అగధ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దర్శక -నిర్మాత ఎం.ఎస్. రాజు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా వచ్చిన అప్డేట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, మొదటి పోస్టర్‌లో కనిపించిన రహస్య యువతి ఎవరో వెల్లడించారు. ఆమె మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల. ఈ చిత్రంలో ఆమె ‘మహాదేవి’ అనే కీలక పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో ఆమె కనిపించిన తీరు సాంప్రదాయ నల్ల చీరలో, దైవ విగ్రహం ముందు గంభీరంగా కూర్చుని ఉండడం పాత్రలో ఉన్న ఆధ్యాత్మిక గాఢతను స్పష్టంగా సూచిస్తోంది. ‘మహాదేవి’ పాత్ర కథలో కేవలం ఒక భాగం కాకుండా, మొత్తం కథానికను ముందుకు నడిపించే శక్తిగా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్రిశూలాలు, దీపాలు, విగ్రహాలతో కూడిన ఆ నేపథ్యం సినిమాలో మిస్టరీ, దైవికత కలయికను బలంగా ప్రతిబింబిస్తోంది. ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనపై దర్శకుడు ఎం.ఎస్. రాజు సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అందించిన ప్రోత్సాహం తన నమ్మకాన్ని మరింత బలపరిచిందని, ర్‌‌ఈ చిత్రం ద్వారా కొత్త అనుభూతిని అందించాలనే సంకల్పాన్ని వెల్లడించారు. రచయితగా, దర్శకుడిగా తన శక్తిమేరకు ఉత్తమ ఫలితాన్ని ఇవ్వాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ సెట్స్, 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్, దాదాపు 85 రోజుల షూటింగ్‌తో ఈ ప్రాజెక్ట్ విజువల్‌గా కూడా గ్రాండ్‌గా ఉండబోతోంది. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి, ‘అగధ’లో కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’గా ఎంట్రీ సినిమాకు కొత్త ఆకర్షణగా మారింది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్‌ విషయానికొస్తే.. సంగీత దర్శకుడిగా రాకేష్ వేంకటాపురం,
సినిమాటోగ్రాఫర్‌‌గా నాని చమిడిశెట్టి, ఎడిటర్‌‌గా జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్‌‌గా రాజీవ్ నాయర్ వర్క్ చేస్తుండగా అడిషినల్‌ స్ర్కీన్‌ప్లేను చైతన్య వేగి అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా ఎన్వీఎన్ సుబ్బరాజ్ వ్యవహరిస్తున్నారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని