మల్లేశం, వకీల్ సాబ్, పొట్టేల్ లాంటి చిత్రాలతో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. ఇటీవల గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్‌స్ర్కిప్షన్ ద్వారా డబ్బులు సంపాదిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెడింగ్లో నిలిచింది. వల్గర్ ఫోటోలు చూపించి సబ్ స్క్రైబర్స్ ని ఆకర్షిస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అనన్య నాగళ్ల ఇలా స్పందించింది.
‘‘నేను ఈ సబ్‌స్ర్కిప్షన్ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు దగ్గర కావడం కోసం మాత్రమే ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. నా జీవితంలో నాకు జరిగినవి, జరుగుతున్నవి ప్రజలకు తెలియజేసి నాకు తోచిన విధంగా అందరికీ సహాయపడాలనే సదుద్దేశంతోనే ఇది సెలెక్ట్ చేసుకున్నా. సాధారణంగా 21 రోజుల పాటు రోజుకు 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనుకుంటూ జపం చేయడం ద్వారా మనశ్శాంతిగా ఉంటుందని, అలా ఎవరైతే 21 రోజుల పాటు జపం చేస్తారో వారికి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేద్దామని అనుకున్నా’ అని ఇదంతా సమాజ సేవకోసమే అన్నట్టుగా ఆమె రిప్లై ఇచ్చింది. ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోని సబ్‌స్ర్కిప్షన్ ద్వారా 390 రూపాయలకే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ జనాలకు వల వేస్తున్నారు. ఇదే తరహాలో అనన్య నాగళ్ల కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవడంతో ఆమె నెగిటివ్ రిమార్క్ ఏర్పడింది.






