‘వాలీ’బాల్ గేమ్ నేపథ్యంలో..

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా వాలీబాల్ గేమ్ నేపథ్యంలో కొత్త మూవీ రాబోతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ చిత్రానికి ‘వాలీ’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌‌లో ఇద్దరు ఆటగాళ్లు స్పోర్ట్స్ గ్రౌండ్‌లో నిల్చోని చేతిలో వాలీబాల్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న పోస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ, భావోద్వేగాలు, మరియు మానవ సంబంధాల్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాఉడు. ఇదే చిత్రంతో పరిచయం కాబోతున్న నిపుణ్‌ సత్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రంలో అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తూ బలమైన నటీనటుల సమూహాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా, స్నేహ దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దిలీప్ కె. మనుకొండ మరియు పవన్ కె. విప్పర్తి సంయుక్తంగా రచించారు. సాంకేతిక విభాగంలో అరుణ్ విజేకే సినిమాటోగ్రఫీ అందించగా, ఔరానోవా స్టూడియోస్ సంగీతాన్ని సమకూర్చింది. ఎడిటింగ్‌ను రవితేజ గిరిజాల నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ మరియు పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. టైటిల్ రివీల్‌తో పాటు మోషన్ పోస్టర్‌కు లభిస్తున్న మంచి స్పందనతో ‘వాలీ’ శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందనే అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించనుంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని