పవన్ కళ్యాణ్ సర్జరీ విషయంలో క్లారిటీ

రెండు రోజుల క్రితమే మెగా హీరో వరుణ్ తేజ్‌ మోకాలికి గాయమై సర్జరీ జరగ్గా, ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగింది. శుక్రవారం ఉదయం తన అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆఫీసర్లతో డిస్కషన్ చేస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన పవన్… కొద్ది నెలలుగా హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటిల్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని టెస్టులతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని సర్జరీ చేశారు. వారం నుంచి పది రోజులపాటు ఆయనకు బెడ్ రెస్ట్ అవసరం ఉందని డాక్టర్లు కోరారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్టు జనసేన అధికార ప్రతినిధి, రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అసలు పవన్ కళ్యాణ్‌కు ఏం జరిగిందని, ఎక్కడ సర్జరీ జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజోనోవా.. ‘ఆయన కోలుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఆల్ ఈజ్ వెల్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.

Related Posts

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ మహా సమ్మేళన్…

సీబీఎన్ బయోపిక్.. ‘అమరావతి’ తర్వాత మరో సంచలనం..

రాజకీయ నాయకుల బయోపిక్‌లను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఒకరి ఛరిష్మను మరింత పెంచుతూ.. తమకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను నెగిటివ్ చూపిస్తూంటారు మేకర్స్. ఇప్పటికే పలువురు పొలిటికల్ లీడర్స్ జీవితాలను సిల్వర్‌‌ స్ర్కీన్‌పై చూపించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని