హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, వారి జీవితంలోని ఈ ప్రత్యేకమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది. మరోవైపు సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.






