Natural Star Nani’s Tattoo Secrets
నేచురల్ స్టార్ నాని ఏం చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కథల ఎంపిక దగ్గర నుంచి పాత్రల కోసం తనను తాను మార్చుకునే విధానం వరకు నాని స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆయన చేతిపై కనిపిస్తున్న సరికొత్త టాటూలు కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
Natural Star Nani’s Tattoo Secrets
నితిన్ హీరోగా నటించిన ‘అలియాస్ రుక్మిణీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నాని చేతిపై కనిపించిన ట్రైబల్ స్టైల్ టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేతి వెనుక భాగంతో పాటు వేళ్లపై కూడా కనిపిస్తున్న ఈ టాటూలను చూసి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఇవి నిజమైన శాశ్వత టాటూలు కావు. తన సినిమాల్లోని పాత్రలకు అనుగుణంగా నాని వేసుకుంటున్న తాత్కాలిక టాటూ డిజైన్లుగా తెలుస్తోంది.
గతంలోనూ నాని తన సినిమాల కోసం ఇలాంటి ప్రయోగాలు చేశారు. 2016లో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో బాలకృష్ణ వీరాభిమానిగా కనిపించిన ఆయన చేతిపై ‘జై బాలయ్య’ టాటూతో ఆకట్టుకున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది పారడైజ్’ సినిమాలో తన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా చేతిపై ఓ బోల్డ్ తెలుగు పదంతో కూడిన టాటూ కనిపించింది. అప్పట్లో ఈ టాటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. ముఖ్యంగా మలయాళ టీజర్లో అనువాద సమస్య కారణంగా ఈ టాటూ మరింతగా వార్తల్లో నిలిచింది.
ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’ కోసం నాని మరో కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం కుడి చేయి, మెడపై ట్రైబల్ స్టైల్ టాటూ డిజైన్లతో సరికొత్త లుక్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో కనిపించిన టాటూలు కూడా ఈ సినిమా లుక్కు సంబంధించినవేననే ఆసక్తి నెలకొంది.
ఒక సినిమాలో ‘జై బాలయ్య’ టాటూ.. మరో సినిమాలో బోల్డ్ తెలుగు పదం.. ఇప్పుడు ‘బ్లడీ రోమియో’ కోసం ట్రైబల్ డిజైన్లు.. ఇలా ప్రతి పాత్రకు తగ్గట్టుగా తన లుక్‌లో మార్పులు చేసుకుంటూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు నాని. మొత్తానికి నాని చేతిపై కనిపించే టాటూలు కేవలం స్టైల్ కోసం కాదు.. తెరపై ఆయన పోషించే పాత్రలకు తగ్గట్టుగా మారే మేకోవర్‌లో భాగమన్నమాట!