Niharika’s Pocket Rockets Title Poster Out
నిర్మాతగా విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్న నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.
Niharika’s Pocket Rockets Title Poster Out
రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తున్నారు. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్గా కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగే ఓ యువకుడు.. తన కలను నెరవేర్చుకోవడానికి గ్యాంబ్లింగ్ మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే, ఆ నిర్ణయం అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? ఆ ప్రయాణంలో ఎదురైన పరిణామాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో పాటు ఉత్కంఠను కలిగించే సంఘటనలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఎదురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గ్యానీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.