గ్యాంగ్ స్టర్ చిత్రాలకు కేరాఫ్ గా ‘టాక్సిక్’

లాస్ వెగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి వేదికపై యశ్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘రామాయణ’ సహ నిర్మాత నమిత్ మల్హోత్ర, యశ్ ఇద్దరూ కలిసి ‘టాక్సిక్’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్‌గా, గైడ్‌గా ‘టాక్సిక్’ ఉంటుందని అభివర్ణించారు.

అంతర్జాతీయ వేదికపై..యశ్ మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మేం సినిమాని చిత్రీకరించాం. ‘టాక్సిక్’లో ఎన్నో లేయర్స్‌ ఉంటాయి. ఇది రెగ్యులర్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ చిత్రం కాదు. పైకి చూస్తుంటే.. ఇదొక యాక్షన్, గ్యాంగ్ స్టర్ మూవీలా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇందులో లోతైన సైకాలజీ, మనల్ని మనం చూసుకునేలా, మానవ సంబంధాలకు ప్రతీకగా ఈ చిత్రం ఉంటుంది. ఓ డార్క్ కారెక్టర్‌ను గొప్పగా చూపించారని మాత్రం చెప్పగలను. గొప్ప టెక్నీషియన్, గొప్ప దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆమె గ్యాంగ్ స్టర్ చిత్రాలకు ఓ కొత్త దారి వేసినట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ ప్రాసెస్ ఎంతో నచ్చింది. నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఇదొక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆడియెన్స్ సైకాలజీ మీద ఈ చిత్రం ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతీ వంద కిలోమీటర్లకు భాష, సంస్కృతి, సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం ప్రతీ ఒక్కరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ అందరినీ కనెక్ట్ చేస్తుంది’ అని అన్నారు.గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని