Manoj Manchu Visits Chamundeshwari Temple
హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ‘దాదా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మైసూరులో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో లభించిన విరామాన్ని కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికంగా గడిపారు. సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరు చాముండి కొండలపై కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
Manoj Manchu Visits Chamundeshwari Temple
ఆలయానికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా ఆలయానికి రావడంతో అక్కడి భక్తులు, అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. ఆయనను పలకరించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఇక మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘దాదా’. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ షెడ్యూల్ మధ్యలో కుటుంబంతో కలిసి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మనోజ్.. సినిమా విజయంతో పాటు కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.