రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. వాస్తవానికి ఈ చిత్రాన్ని చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయాలని భావించారు. కానీ అప్పటికీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ డేట్‌కు కూడా పెద్ది రావడం కష్టమే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌కు వస్తామని చెప్పినా.. ఇంకా కొంత షూట్ చేయాల్సి ఉందని, సాంగ్‌తో పాటు కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉండటంతో రిలీజ్ కష్టమేనని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 30కి వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పటికి కనీసం టీజర్, ట్రైలర్ రావాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్ అయినా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటివి టీమ్ చేయడం లేదు. దీంతో పెద్ది కచ్చితంగా సమ్మర్ కూడా స్కిప్ చేసినట్టేనని క్లారిటీకి వస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రాన్ని వర్షాకాలానికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. జూన్ మొదటి వారంలో కానీ, లేదంటే జూన్ ఆఖరి వారంలో కానీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ టైమ్‌లో వచ్చే సినిమాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజుల్లోనే కొత్త రిలీజ్ డేట్‌పై టీమ్ క్లారిటీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చరణ్.. క్రికెటర్‌గా, పెహల్వాన్‌లా రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మరోవైపు ఈ ప్రెస్ట్రేజీయస్ సినిమాకోసం ఏ.ఆర్.రెహమాన్ ఓ ఎక్స్‌లెంట్ అంథమ్ రెడీ చేస్తున్నారట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దాన్ని వినిపించి ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ని నింపుతారని తెలుస్తోంది.






