రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్గా నటిస్తోంది. నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేసిన పాటకు కమల్ ఎస్లవత్ క్యాచీ లిరిక్స్ అందించాడు. శృతి రంజని పాడిన తీరు ఆకట్టుకుంది. ‘ఒట్టేసుకోన కోరమీసాల మీన.. నన్ను కట్టేసుకోన కాలమంతా నీతాన.. పెట్టేసుకోన పాణాల మీద ఆన, నిన్ను సుట్టేసుకోన పంచ పాణాలే ఇచ్చుకోన.. బావ బావ అంటుంటే బాగుందే నీతో ఉంటుంటే.. నీడై రాన నీవంటే అస్సలేమవుతానో నువ్వు లేకుంటే..’ అంటూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన మెలోడీ సినిమాపై ఆసక్తిని పెంచింది. మాధవ్, దీపా బాలు జోడీ ఇంప్రెస్ చేసింది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.





