Nandamuri Mokshagna Grand Debut
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన డెబ్యూ సినిమాను ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
Nandamuri Mokshagna Grand Debut
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సరైన కథను ఎంచుకునేందుకు కొంత సమయం తీసుకున్న విషయం తెలిసిందే. పలు కథలను పరిశీలించిన అనంతరం, తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘బింబిసార’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకుని.. చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వశిష్ఠ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. మోక్షజ్ఞ లాంటి నందమూరి వారసుడు, వశిష్ఠ లాంటి విజనరీ డైరెక్టర్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి బిగ్ బ్యానర్ కలవడంతో సినిమాపై అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి.

సినిమా ప్రకటనతో పాటు మేకర్స్ విడుదల చేసిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ, మోక్షజ్ఞలను చిత్ర బృందం కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సందర్భానికి సంబంధించిన ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఫిట్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఆయన లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
హీరోగా తొలి సినిమాతోనే తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే పట్టుదలతో మోక్షజ్ఞ ఇప్పటికే ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. కమర్షియల్ హీరోకు అవసరమైన ఫిజికాలిటీ, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాలపై ఫోకస్ చేస్తూ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? ఇతర కీలక పాత్రల్లో కనిపించబోయే నటీనటులు ఎవరు? సినిమాకు పనిచేయనున్న టెక్నికల్ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. మేకర్స్ త్వరలోనే ఈ వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
నందమూరి కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడి ఎంట్రీకి రంగం సిద్ధం కావడంతో.. మోక్షజ్ఞ తొలి సినిమా టాలీవుడ్లో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.