Venkatesh Adarsha Kutumbam Release Confirmed
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించారు. సినిమాలోని ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై వస్తున్న రూమర్స్‌కు నిర్మాత నాగవంశీ చెక్ పెట్టారు. సినిమా వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ నుంచి తాజాగా క్లారిటీ వచ్చింది.
Venkatesh Adarsha Kutumbam Release Confirmed
సినిమా వాయిదా వార్తలకు చెక్ పెడుతూ, ముందుగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చే నెల రోజుల పాటు ప్రతి వారం ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే వారం ప్రారంభంలో టీజర్, రెండో వారంలో ఫస్ట్ సాంగ్, చివరి వారంలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతి వారం ఒక మ్యూజికల్ కంటెంట్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
“మీరు ‘ఆదర్శకుటుంబం’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. ప్రతిరోజూ అప్డేట్స్ అడుగుతున్నారని కూడా తెలుసు. మీ మాట విన్నాం.. ఆలస్యానికి సారీ. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు ముందు ఈ నెల మొత్తం సర్ప్రైజ్లతో నిండిపోనుంది” అంటూ నాగవంశీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో #AK47Month పేరుతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను మరింత జోరుగా నిర్వహించనున్నారు. టీజర్ నుంచి ట్రైలర్ వరకు వరుస అప్డేట్స్తో ప్రేక్షకుల్లో సినిమాపై హైప్‌ను పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వాయిదా వార్తలకు తెరదించడంతో అభిమానుల్లోనూ ఉత్సాహం మరింత పెరిగింది.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కథలోని కుటుంబ నేపథ్యం, పాత్రల మధ్య సంబంధాలు, ఎమోషన్స్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్ నటించిన నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల సక్సెస్‌లో రైటర్‌గా త్రివిక్రమ్‌కు ఎంతో పేరు వచ్చింది. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘ఏకే 47’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47) విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు నిర్మాత నాగవంశీ చెక్ పెట్టారు. సినిమా అక్టోబర్ 2న అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.
ప్రమోషన్స్‌లో భాగంగా నెల రోజుల పాటు వరుసగా కొత్త కంటెంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వారం టీజర్, ఆ తర్వాత ఫస్ట్ సాంగ్, విడుదలకు ముందు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.