Romanchakam pre release event Highlights
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..‘‘ సందీప్ పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. అది ఒక దర్శకుడు, హీరో మధ్య ఉన్న బంధం కాదు, ఒక బ్రదర్స్ మధ్య ఉన్న బంధం కాదు, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు. మా బంధం అంతకుమించింది. అర్జున్ రెడ్డి టైమ్ లో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకుంటే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. మాకు అప్పుడు డబ్బు లేదు, పేరు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. పెళ్లిచూపులు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి అభిమానులైన మీరు కూడా మా వెనక లేరు. జస్ట్ మేము ధైర్యంగా అడుగేశాం. అర్జున్ రెడ్డి సినిమా లేకుంటే ఆ సక్సెస్ మాత్రమే కాదు సందీప్ తో షేర్ చేసుకున్న ఎన్నో ఎక్సిపీరియన్స్ లు, మూవ్ మెంట్స్ మిస్ అయ్యేవాడిని. జీవితం గురించి మాట్లాడుకున్న ఎన్నో సందర్భాలు మిస్ అయ్యేవాడిని. డబ్బు లేనప్పుడు సందీప్ వాళ్ల బ్రదర్ ప్రణయ్, ఫాదర్ తో పొలం అమ్మించి నాతో నా మీద నమ్మకంతో అర్జున్ రెడ్డి సినిమా చేశాడు. వాళ్ల ఫ్యామిలీ సంపాదన మొత్తం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేశాడు. సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా, నాకోసం సందీప్ ఎక్కడిదాకా అయినా వస్తాడు. ఆయన పిలిచాక నేను ఈ ఫంక్షన్ కు రాకుంటే నేను బతికి ఎందుకు. సుమంత్ ను చూసినప్పుడు ఆయన కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్ కనిపించింది. అప్పుడే అనుకున్న సుమంత్ ప్రభాస్ ఏదో ఒక రోజు యాక్టర్ లేదా డైరెక్టర్ అవుతాడు. అప్పుడు మనం చేయగలిగినంత ఇతనికి చేయాలని. భద్రకాళీ లోగో పడుతుంటే అర్జున్ రెడ్డి సౌండ్ వినిపిస్తుంటుంది. సందీప్ అన్న ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సందీప్, ప్రణయ్ తో పాటు ఈ కొత్త టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. సెప్టెంబర్ 2న ప్రీమియర్స్ తోనే ఈ సినిమా ఘన విజయం సాధించాలి. సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేశాం అనేది ముఖ్యం. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, మనలో విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది”అని అన్నారు.
Romanchakam pre release event Highlights
ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ..- ‘డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా అని అడిగాను. ఆయన ఒక 6 నిమిషాల నిడివి గల సీన్ తీసుకొని వచ్చి చూపించాడు. స్క్రిప్ట్ లో ఉన్న దానికంటే ఇంకా బాగా సీన్ తెరకెక్కించాడు అనిపించింది. అప్పటి నుంచి వేణుకే ఈ సినిమా బాధ్యత మొత్తం అప్పగించాను. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేం కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి బాగా నటించాడు. అతనిది అమాయకమైన క్యారెక్టర్. ఆ పాత్రలో బాగా నటించాడు అనిపించింది. అనంతిక పర్ ఫార్మెన్స్ రియల్లీ గుడ్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో నటించిన వాళ్లంతా సూపర్బ్ గా నటించారు. మ్యూజిక్ కోసం వాసుకిని తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో తీసుకున్నాం. పాటలు, మ్యూజిక్ విన్నప్పుడు అది నిజమైంది అనిపించింది. సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్, సెప్టెంబర్ 2నే ప్రీమియర్స్ వేస్తున్నాం. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు నీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. నాకు, విజయ్ కు అర్జున్ రెడ్డి రిలీజైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు నీకూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. సినిమా అంతా గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలని కూడా అనుకుంటారు. అలాంటి ఫన్ సీన్స్ కూడా ఉన్నాయి’ అని అన్నారు.
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ..- ‘విజయ్ అన్న, సందీప్ అన్న అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదు. మాపై ఆ సినిమా ఎంతో ఇంపాక్ట్ చూపించింది. అర్జున్ రెడ్డి తర్వాత దేశమంతా మన వాళ్లైన సందీప్, విజయ్ అన్న గురించి తెలిసింది. మాట్లాడుకున్నారు. ఈ రోజు వాళ్ల బ్యానర్ లో సినిమా చేస్తుంటే నాకూ పెద్ద హీరో కావాలనిపిస్తోంది. అందుకు ఈ సినిమానే మెట్టు కావాలి. ఈ సినిమా మిమ్మల్ని ఎంత ఎంటర్ టైన్ చేస్తుందో, ఎంత నవ్విస్తుందో నేను ఊహించగలను. ఆ క్యారెక్టర్స్ లో ఉండే ఫన్, స్వీట్ నెస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 3న ఈ క్యూట్ ఫీల్ మీకు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా ఉంటుంది. ఇదొక క్యూట్ ఫన్ ఫిలిం. మీరు ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్ తో వెళ్లినా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.
ఈ రోమాంచకం జర్నీలో పార్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ చెప్పింది.
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘‘- కబీర్ సింగ్ తర్వాత సందీప్ అన్నతో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆయన కథ విన్న పది నిమిషాల్లో నెక్ట్స్ ఎలా ఉండబోతుందో చెబుతాడు. ప్రణయ్ అన్న సందీప్ అన్న ఇద్దరికీ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. ఈ కథ వారికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతోనే వెళ్లి చెప్పాను. నాకు వాళ్లు ఇచ్చిన ఫ్రీడమ్ చూసి చాలా మంది అసూయపడుతున్నారు. సందీప్ అన్న నాకు ఒకటే విషయం చెప్పారు. నీ సినిమా నీ విజన్ జస్ట్ డూ ఇట్ అన్నారు. ఆయన నా కథపై, నా క్యారెక్టర్స్ పై, నాపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. కాలేజ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక రియాల్టీ తెలుస్తుంది. ఆ సందర్భాన్ని నా కథలో చెప్పాను. ఆ సందిగ్ధ పరిస్థితిని సహజంగా, అందంగా నా తరహాలో సినిమాగా తెరకెక్కించాను. ఈ సినిమాకు నేను సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోలేదని సందీప్ అన్న చెప్పారు. ఆయన చెప్పినట్లు నిజంగానే ఫ్రెష్ రైటింగ్, ఫ్రెష్ పర్ ఫార్మెన్స్ లతో ఈ సినిమా చేశాను. మేమ్ ఫేమస్ సినిమాలోని చిన్న సీన్ చూసి సుమంత్ ను తీసుకున్నాను. ఆయనలో ఎంతో ప్రతిభ ఉంది. ఈ మూవీలో క్యారెక్టర్ ను సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ అన్నను ఫిలింమేకర్స్ ఎలా చూశారో ఈ సినిమా తర్వాత సుమంత్ ప్రభాస్ ను అలా చూస్తారు. అనంతిక మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. సూపర్బ్ టాలెంటెడ్. నేను ఏ టెక్నీషియన్ ను అడిగినా సందీప్ అన్న, ప్రణయ్ అన్న ఇచ్చేవాళ్లు కానీ నేను 99 పర్సెంట్ కొత్త వాళ్లతోనే సినిమా చేశాను. నా విజన్ ను నమ్మాను. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. అంతే కొత్త పర్ ఫార్మెన్స్ లు మీరు చూడబోతున్నారు. రోమాంచకం ఫ్రెష్ ఫీల్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది”అని అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ -‘‘ సుమంత్ ప్రభాస్ బయట ఎలా సరదాగా ఉంటాడో మా సినిమాలోని క్యారెక్టర్ లో కూడా అలాగే కనిపిస్తాడు. ఆయన పర్సన్ గా ఎలా ఉంటాడో మా క్యారెక్టర్ కు కూడా 70 పర్సెంట్ సరిపోయాడు. వేణుగోపాల్ గారి విజన్ ను నమ్మి వారంతా ప్యాషన్ తో వర్క్ చేశారు. వాసుకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పవన్ డీవోపీగా అమేజింగ్ వర్క్ చేశారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా చూసే క్లీన్ మూవీ ఇది”అని అన్నారు.
డైరెక్టర్స్ మెహర్ రమేష్, శౌర్యువ్ , నటులు కమల్, సతీష్, మానస, సోహాన్, మణి, నరేంద్ర, డీవోపీ పవన్ పప్పుల, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్, లిరిక్ రైటర్ చంద్రబోస్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.