Yash Calls Toxic a Path-Breaking Film
యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్టు 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Yash Calls Toxic a Path-Breaking Film
సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ.. ‘టాక్సిక్’ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుందని తెలిపారు. ఈ సినిమా కోసం బెస్ట్ ఆర్టిస్టులు, బెస్ట్ టెక్నీషియన్లు కలిసి పనిచేశారని, ఇది పాత్ బ్రేకింగ్ మూవీగా నిలుస్తుందని అన్నారు.
‘‘టాక్సిక్ ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సినిమాను చాలా ప్యాషన్‌తో తెరకెక్కించాం. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అని యశ్ పేర్కొన్నారు.
Yash Calls Toxic a Path-Breaking Film
అలాగే యువతను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు అనుకున్నది మనసులో బలంగా సంకల్పించుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అనుకున్న విజయాలను సాధిస్తారు. ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీపై నమ్మకంతో పనిచేయండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది”అని అన్నారు.
సినిమాలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తెలిపారు. తమ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ.. పెద్ద విజన్, బోల్డ్ డ్రీమ్‌తో ‘టాక్సిక్’ను అత్యంత అందంగా నిర్మించామని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడంపై నిర్మాత దిల్ రాజు కూడా నమ్మకం వ్యక్తం చేశారు. ‘టాక్సిక్’పై ఉన్న విశ్వాసంతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో యశ్ అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.