Missing Meghana First Song Launched by Suresh Babu
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.
Missing Meghana First Song Launched by Suresh Babu
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. ‘పిల్ల పిల్ల పిల్ల’ అంటూ సాగే ఈ పాటను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మూవీ టీంతో పాటు బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించడంతో పాటు సాహిత్యం కూడా సమకూర్చారు. ప్రముఖ గాయకుడు జావేద్ అలీ ఈ పాటను ఆలపించారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ‘పిల్ల పిల్ల పిల్ల’ ఫస్ట్ సింగిల్ చాలా బాగుందని ప్రశంసించారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. ఇండియన్ ఫిలిం ఫీల్డ్‌లో సురేష్ ప్రొడక్షన్స్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు అందరికీ తెలుసని, అలాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు వాచస్పతి అన్నారు. తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు, కో-ప్రొడ్యూసర్ దివెళా శ్రీనివాస్ రావ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ టీమ్‌కు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అద్భుతమైన పాటలు అందించిన ఆర్.ఆర్. ధృవన్‌కు, ‘పిల్ల పిల్ల పిల్ల’ పాటను ఆలపించిన జావేద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత నరేష్ బాబు మాట్లాడుతూ.. తమ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగిందని, అదే స్టూడియో అధినేత సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత నరేష్ బాబు తెలిపారు. ఆర్.ఆర్. ధృవన్తో తమకు ఇది రెండో సినిమా అని, గతంలో ‘తంత్ర’ మ్యూజికల్‌గా ఎంత సక్సెస్ అయిందో.. ‘మిస్సింగ్ మేఘన’ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధృవన్ స్వయంగా రాసి, సంగీతం అందించిన ఈ పాటను జావేద్ అలీ పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. తన సినిమా జర్నీ రామానాయుడు స్టూడియో నుంచే ప్రారంభమైందని, అలాంటి చోట ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సురేష్ బాబు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని రామ్ కార్తీక్ అన్నారు. దర్శకుడు వాచస్పతి మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారని, ఆర్.ఆర్. ధృవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని చెప్పారు. తమ టీమ్‌కు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత నరేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మిస్సింగ్ మేఘన’ ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ.. లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ అన్నారు. ఈ బ్యానర్లో తాను చేస్తున్న రెండో సినిమా ఇదని, ‘పిల్ల పిల్ల పిల్ల’ పాటను తానే రాసి సంగీతం అందించానని తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన సింగర్ జావేద్ అలీ ఈ పాట పాడటం ఆనందంగా ఉందన్నారు. ‘మిస్సింగ్ మేఘన’ ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ అని, సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ధృవన్ తెలిపారు.
శామ్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం, బసవా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను వనరాజ్ అందించగా, వెంకట్ బద్దిగం సంభాషణలు రాశారు. జేడీ, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రామకృష్ణ, స్టంట్ శంకర్ ఫైట్స్ అందిస్తున్నారు.