Vega Leela Teaser: What’s the Real Story?
‘జబర్దస్త్’ ఫేమ్ ప్రియాంక సింగ్, ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్,అశోక్ వర్ధన్ లీడ్ రోల్స్‌లో ఘంటసాల నాగ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వేగలీలా’. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సాయి కుమార్ మేడి, వేణు జయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Vega Leela Teaser: What’s the Real Story?
టాలీవుడ్లో విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాల జాబితాలో ‘వేగ లీలా’ కూడా చేరుతుందని తాజాగా రిలీజ్ చేసిన ద్వారా అర్ధమవుతోంది. ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా కథను పరిచయం చేశారు. సాధారణంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రక్రియ చుట్టూ జరిగే కథలా కనిపిస్తున్నప్పటికీ.. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అసలు కథలో మరో ఆసక్తికరమైన కోణం ఉన్నట్లు సూచిస్తున్నాయి. దీంతో ‘వేగ లీలా’ అసలు కథ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. కథ ఏంటో గెస్ చేయగలరా అంటూ చిత్ర బృందం ఇచ్చిన హింట్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రియాంక సింగ్,ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్,అశోక్ వర్ధన్ పాత్రలు ఆసక్తిరేపేలా ఉన్నాయి.
జి.వి. & పవన్ చరణ్ సంగీతాన్ని అందిస్తుండగా, దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రఫీని, దిలీప్ కుమార్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. వేగ లీల చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తో కథపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనుంది. శ్రీకాంత్ వేంపరాల (USA), విక్రమ్ గార్లపాటి (USA), విశ్వనాథ్ మంచి కలపతి (USA), వెంకట్ చిలకాల (USA), మహీంద్ర అరవపల్లి (USA), స్వాతి.వై, రామ్ భూపతి, దిలీప్ కుమార్ చిన్నయ్య కో-ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.