Sundeep Kishan FirstLook Fantacy ‘Karikala’
హీరో సందీప్ కిషన్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శంబాల’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రానికి ‘కరికాల’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Sundeep Kishan FirstLook Fantacy ‘Karikala’
బుధవారం విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. రాజసం ఉట్టిపడే యోధుడి గెటప్‌లో సందీప్ కిషన్ గుర్రంపై దూసుకెళ్తుండగా, అతడికి సమాంతరంగా సింహం పరుగెత్తే విజువల్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతిలో ఖడ్గం, అడవి నేపథ్యం, విజువల్ ట్రీట్‌లా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిన ఫాంటసీ ప్రపంచాన్ని సూచిస్తోంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం 2027 జూలై 2న, రెండో భాగం 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండు పార్టుల రిలీజ్ డేట్లను ఒకేసారి ప్రకటించడం సినిమాపై నిర్మాతల నమ్మకాన్ని చాటుతోంది.
‘శంబాల’ విజయానంతరం యుగంధర్ ముని ఈ చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. విశాలమైన వరల్డ్ బిల్డింగ్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, ఆకట్టుకునే కథనంతో ‘కరికాల’ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కొత్త ఫాంటసీ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.