Srinidhi Shetty AK47 Swarna
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన చిట్టిబాబు పాత్ర పరిచయానికి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు చిత్ర బృందం ఈ ఆదర్శ కుటుంబంలోని మరో ముఖ్యమైన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
Srinidhi Shetty AK47 Swarna
ఇందులో స్వర్ణ అనే పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనుందని రివీల్ చేశారు. చిట్టిబాబుకు భార్యగా, ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర రూపొందింది. కుటుంబానికి అండగా నిలిచే స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించనుందని చిత్ర బృందం తెలిపింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన క్యారెక్టర్ గ్లింప్స్‌లో చిట్టిబాబు చెప్పిన “ఈ ఆడాళ్లకి Attitude తప్ప Gratitude ఉండదు!” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, సరదా సంభాషణలు, ప్రేమాభిమానాలు, కుటుంబ విలువలను ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
ఈ గ్లింప్స్‌లో నివేదా పేతురాజ్‌తో పాటు సత్య కూడా కొన్ని క్షణాలు కనిపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. వీరి పాత్రలు కథలో వినోదానికి మరింత బలం చేకూర్చనున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన పాత్ర పరిచయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, త్వరలోనే యువినా పార్థవి పోషిస్తున్న ‘సంపూర్ణ’, రాజా ప్రజ్వల్ నటిస్తున్న ‘సర్వ’ పాత్రలను కూడా చిత్ర బృందం పరిచయం చేయనుంది.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీం అందిస్తుండగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం సమపాళ్లలో మేళవించిన పూర్తి కుటుంబ కథాచిత్రంగా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.