Raasa Gummadi Delivers Festive Folk Vibes
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, కామెడీ, మాస్ ఎంటర్టైన్మెంట్ కలగలిసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, తొలి పాట ‘కంసహామ్నిదా’ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.
Raasa Gummadi Delivers Festive Folk Vibes
తాజాగా చిత్రబృందం సినిమా నుంచి రెండో సాంగ్ ‘రాసా గుమ్మడి’ను విడుదల చేసింది. తొలి పాటలో కొరియన్ ఫ్లేవర్‌ను చూపించిన మేకర్స్, ఈసారి పూర్తి భిన్నంగా స్వచ్ఛమైన తెలుగు జానపద శైలిలో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎస్. తమన్ స్వరపరిచిన ఈ పాటలో ఎనర్జిటిక్ బీట్స్, గ్రామీణ వాయిద్యాల విన్యాసం, జాతర వాతావరణాన్ని గుర్తు చేసే ఫోక్ వైబ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పాట ప్రారంభంలో హీరోయిన్ హీరోను “వన్నె రాయుడు” అంటూ ఆప్యాయంగా పలకరించే సన్నివేశంతో మొదలై, ఆ తర్వాత ఫుల్ ఎనర్జీతో సాగే ఫోక్ సెలబ్రేషన్‌గా మారుతుంది. జానపద గాయకుడు నల్గొండ గద్దర్ తన ప్రత్యేకమైన గాత్రంతో పాటకు మరింత ఉత్సాహాన్ని జోడించగా, కాసర్ల శ్యామ్ అందించిన క్యాచీ లిరిక్స్ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ పాటలో వరుణ్ తేజ్ సంప్రదాయ దుస్తులతో పాటు స్టైలిష్ షేడ్స్‌లో మాస్ లుక్‌తో మెప్పించారు. ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. కార్నివాల్ థీమ్‌లో రూపొందించిన కలర్‌ఫుల్ సెట్స్, గ్రాండ్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి.
ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన దక్ష నగార్కర్ తన గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అలరించగా, వరుణ్ తేజ్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్‌పై ప్రత్యేకంగా నిలిచింది. పండుగ వాతావరణం, ఫోక్ బీట్స్, మాస్ కొరియోగ్రఫీ కలిసిన ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించేలా ఉందని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సత్య కీలక వినోదాత్మక పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ, సత్య జి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.