RAPO23 Launched Grandly: Regular Shoot Begins
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న RAPO23 చిత్రం ఈరోజు అధికారికంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా తనలో రూపుదిద్దుకున్న ఆలోచనకు రూపమిస్తూ, ఈ చిత్రంతో రామ్ పోతినేని దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూనే కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతగా నిలుస్తోంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని కెరీర్లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రంగా RAPO23 నిలవనుంది.
RAPO23 Launched Grandly: Regular Shoot Begins

ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్‌ను రామ్ పోతినేనికి అందజేశారు. మురళీ పోతినేని ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం.
పూజా కార్యక్రమం అనంతరం చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో ప్రారంభమైంది. రామ్ పోతినేని సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

RAPO23 Launched Grandly: Regular Shoot Begins
ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రచించారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న కథాంశం, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణం, ఉత్కంఠభరితమైన కథనంతో సినిమా రూపొందుతోంది.
దర్శకత్వం, కథతో పాటు కథానాయకుడిగానూ రామ్ పోతినేని బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావాన్ని సూచిస్తోంది. తన కెరీర్లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రను ఈ చిత్రంలో ఆయన పోషించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చిత్రంలోని ఇతర కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
RAPO23 Launched Grandly: Regular Shoot Begins
సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
విభిన్నమైన కథ, భారీ నిర్మాణ విలువలు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో తెరకెక్కుతున్న RAPO23 రామ్ పోతినేని సినీ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది.