O Sukumari First Song Brings Wedding Vibes
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’ నుంచి ఫస్ట్ సింగిల్ సోమవారం విడుదలైంది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ఫుల్ జోష్ ఉన్న వెడ్డింగ్ సాంగ్‌తో మరోసారి ఆకట్టుకుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ మంచిరాజు సంగీతం అందించారు.
O Sukumari First Song Brings Wedding Vibes
‘యాదిగాని పెళ్లిలోన ఊరంతా లొల్లి లొల్లి.. పిల్లేమో సుకుమారి.. పిల్లగాడు పిసినారి..” అంటూ సాగే ఈ పాటకు దర్శకుడు భరత్ దర్శన్ సరదాగా, మాస్ టచ్‌తో లిరిక్స్ రాయగా.. జెస్సీ గిఫ్ట్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “అబ్బాయికి అర్జెంటు.. లైఫ్ లాంగ్ వారెంటు.. ఓ ఇక మంచి రోజులు వచ్చినాయిరో.. మన పౌరుషాలు ఒక్కటాయిరో.. నిన్ను టచ్ చేసే వాడులేడురో..” వంటి ఫన్నీ లైన్స్ ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సాంగ్‌లో దామినిగా ఐశ్వర్య రాజేష్, యాదగిరిగా తిరువీర్ సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపిస్తూ చక్కని కెమిస్ట్రీని ప్రదర్శించారు. రంగురంగుల పెళ్లి వేదిక, ఊరంతా సందడి, ఫ్యామిలీ సెలబ్రేషన్ వైబ్‌తో సాగిన ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
టీజర్ తర్వాత ఫస్ట్ సింగిల్కూ మంచి స్పందన రావడంతో ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.