Akhil Lenin Postpone Reasons
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్-ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ మరోసారి వాయిదా పడింది. జూలై 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్‌తో ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈ వరుస మార్పులు అభిమానుల్లో అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ‘సినిమాకు ఏమైనా సమస్యలున్నాయా?, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదా?, లేక వ్యాపార కారణాలా?’’ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బెస్ట్ అవుట్‌పుట్ కోసమే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల నాగార్జున తన ఎక్స్‌లో పోస్ట్ చేసినా అసలు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
Akhil Lenin Postpone Reasons
అసలు విషయం ఏమిటంటే.. ‘లెనిన్’ను అఖిల్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. భారీ స్థాయి విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ఫైనల్ ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు విషయంలో మేకర్స్ రాజీ పడకూడదనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే కాస్త ఆలస్యమైన పర్వాలేదనుకుని మరోసారి వాయిదా వేశారు.
మరోవైపు జూన్ చివరి వారంలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపించింది. దీంతో సోలో రిలీజ్ విండో కోసం మరో రెండు వారాలు వెనక్కి వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బెస్ట్ అవుట్ పుట్ కోసమే ఇదంతా చేస్తున్నారు.
గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో అఖిల్ కెరీర్‌కు ‘లెనిన్’ చాలా కీలకంగా మారింది. అందుకే నిర్మాతలు, దర్శకుడు సినిమా విషయంలో ఎలాంటి తొందరపడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ వచ్చే వరకు సమయం తీసుకుంటున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్లో అఖిల్ ఓ దేవాలయ నిర్మాణంపై నిలబడి జెండా ఎగురవేస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. సూర్యాస్తమయం బ్యాక్‌డ్రాప్, ఎరుపు-నారింజ రంగుల విజువల్ టోన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. జూలై 10న పండగ మొదలు అంటూ ‘భావోద్వేగాల తుఫాను. ప్రేమ తుఫాను. ఒక బ్లాక్‌బస్టర్ అనుభూతికి వేదికగా మారుతోంది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. వరుస వాయిదాలు అభిమానులను కొంత నిరాశపరిచినా, సినిమా నాణ్యత కోసం సమయం తీసుకోవడం మంచిదేనని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెట్ సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి.
మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.