ఒక్కోసారి ఒక గ్లింప్స్ సినిమా గురించి చెబుతుంది. కానీ కొన్ని గ్లింప్స్‌లు ఒక పాత్ర గురించి కాదు.. ఒక యుగం గురించి చెబుతాయి. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన NBK111 ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ అలాంటి గ్లింప్స్గానే నిలిచింది.
1993 బాంబే అల్లర్ల నేపథ్యంలో నడిచే రక్తపాత ప్రపంచాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ గ్లింప్స్‌లో చూపించారు. అగ్నిజ్వాలలు, రక్తపు మరకలు, ఆయుధాల మోత, భయంతో వణికిపోయే వీధులు.. అంతా గందరగోళంతో నిండిపోయిన ఆ ప్రపంచంలో ఒక్క వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రతి ఫ్రేమ్ కనిపించింది. అలాంటి సమయంలో తెరపై కనిపించిన బాలకృష్ణ ఎంట్రీ మాత్రం సాధారణ హీరో ఇంట్రడక్షన్ కాదు.. అది ఒక ప్రకటన. అరాచకాలను నియంత్రించడానికి, భయాన్ని పాలించడానికి, శత్రువులను వేటాడడానికి ఒక శక్తి వచ్చిందనే సంకేతం. అందుకే ఆయన పాత్రకు ‘కింగ్ ఆఫ్ కేయాస్’ అనే టైటిల్ మరింత పర్ఫెక్ట్గా సరిపోయింది.
ఈ గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ప్రత్యేకత. కానీ బాలయ్య కళ్లలోని తీవ్రత, నడకలోని ఆత్మవిశ్వాసం, బాడీ లాంగ్వేజ్‌లోని పవర్ మాటలకంటే ఎక్కువగా మాట్లాడాయి. వయసు పెరుగుతున్న కొద్దీ బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ మరింత పవర్‌ఫుల్‌గా మారుతోందని ఈ గ్లింప్స్ మరోసారి నిరూపించింది.
గోపీచంద్ మలినేని బాలయ్యను మాస్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అంతకంటే ఎత్తులో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినట్లు ప్రతి షాట్లో స్పష్టంగా కనిపించింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతోందనే సంకేతాలు కనిపించాయి. అరవింద్ ఎస్. కశ్యప్ కెమెరా విజువల్స్‌కు హాలీవుడ్ స్థాయి గ్రాండియర్ తీసుకొచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లో డార్క్ టోన్, రగ్డ్ టెక్స్చర్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇక ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గ్లింప్స్‌కు ప్రాణం పోసింది. స్క్రీన్‌పై బాలయ్య కనిపించే ప్రతి క్షణాన్ని మరింత ఎలివేట్ చేస్తూ అభిమానుల్లో గూస్బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో సినిమా కథను చెప్పకుండా, హీరో ప్రభావాన్ని చూపించడం మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయంగా తెలుస్తోంది. దీంతో కథపై ఆసక్తి అలాగే ఉంచుతూ, బాలయ్య పాత్రపై భారీ క్యూరియాసిటీని పెంచగలిగారు.
ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. NBK111లో బాలకృష్ణ కేవలం హీరో కాదు.. అల్లకల్లోలానికి నిర్వచనంగా, భయానికి సమాధానంగా, కేయాస్ను పాలించే కింగ్‌గా కనిపించబోతున్నారు.
ఈ గ్లింప్స్ చూసిన తర్వాత అభిమానులు ఒక్కటే చెబుతున్నారు.. ‘ఇది కేవలం ఎంట్రీ కాదు, బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ యుగానికి శ్రీకారం’. అని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.